Corona Virus: తెలంగాణలో తొలి కరోనా కేసు... హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

High alert in Telangana as first corona case diagnosed
  • దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
  • ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమైన మంత్రి ఈటల
  • కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని అన్నారు. కాగా, హైదరాబాదులో ఇద్దరు అనుమానితులకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది.
Corona Virus
Hyderabad
Telangana
High Alert
Etela Rajender

More Telugu News