Local bodies elections: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్​.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో కొట్టివేత

 Local bodies elections reservations GO dismissal by the AP High Court

  • స్థానిక’ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకిస్తూ పిటిషన్
  • సుప్రీంకోర్టు తీర్పుకు ఈ జీవో విరుద్ధం
  • 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవన్న హైకోర్టు

ఏపీలోని జగన్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది.

బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం, నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. కాగా, ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. తాజాగా వెలువడ్డ కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థలు ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News