Narendra Modi: సోషల్ మీడియాను కాదు, విద్వేషాన్ని వదిలేయండి: మోదీకి రాహుల్ హితవు
- సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనుకుంటున్న ప్రధాని
- మోదీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ
- స్పందించిన రాహుల్, కేటీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారారు. ఆయన సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని భావిస్తుండడమే అందుకు కారణం. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. మన ప్రధాని అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.