Nitish Kumar: 46 మంది చనిపోతే మాట్లాడరా?: నితీశ్‌పై ప్రశాంత్ కిశోర్ ఫైర్
- 15 ఏళ్ల ఆయన పాలనతో బీహార్ ఇంకా పేద రాష్ట్రంగానే ఉంది
- నిరుద్యోగం కారణంగానే యువత వలసబాట పడుతోంది
- వలస వెళ్లడం తప్పుకాదన్న నితీశ్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్లలో 46 మంది చనిపోతే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్న నితీశ్.. తన 15 ఏళ్ల పాలనలో బీహార్ ఇప్పటికీ ఎందుకు పేద రాష్ట్రంగా మిగిలిపోయిందనే విషయం గురించి మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు.
నితీశ్ కుమార్ నిన్న పాట్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. దేశం అంతా ఒకటేనని, ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడాన్ని సమస్యగా చూడకూడదని అన్నారు. నిరుద్యోగం కారణంగానే బీహార్ యువత రాష్ట్రాన్ని వీడుతోందని ప్రశాంత్ కిశోర్, కన్నయ్య కుమార్ వంటి నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా సీఎంపై ఇలా విమర్శలు కురిపించారు.