Upasana: అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించాం: ఉపాసన కొణిదెల

Apollo Hospital Detects Corona Case
  • బాధితుడికి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స
  • ప్రజలు బాధ్యతగా ఉండాలి
  • ట్విట్టర్ లో సూచించిన కొణిదెల ఉపాసన
సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించామని కొణిదెల ఉపాసన వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్, వీడియోను పెట్టిన ఆమె, కరోనా వైరస్ పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు.

సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.
Upasana
Corona Virus
Apollo Hospital
Gandhi Hospital

More Telugu News