South Korea: రెండు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా: దక్షిణ కొరియా సంచలన ఆరోపణలు

North Korea Tests Ballistic Missiles

  • 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్య ఛేదన
  • క్షిపణి పరీక్షలపై సమాచారం అందింది
  • తూర్పు తీరం గుండా ప్రయోగించారన్న సౌత్ కొరియా

సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న రెండు క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించిందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో తమకు స్పష్టమైన సమాచారం లభించిందని, తూర్పు తీర ప్రాంతం మీదుగా వీటిని ప్రయోగించారని పేర్కొంది. ఇవి రెండూ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులని తెలిపిన ఓ అధికారి, ఇటీవలే తాము ఓ వ్యూహాత్మక మిసైల్ ను పరీక్షించనున్నట్టు కిమ్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, అమెరికాతో జరిగిన అణు చర్చల ఫలితాలు తేలకుండానే కిమ్, ఈ మిసైల్ టెస్టింగ్ కు అనుమతి ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News