KTR: తెలంగాణలో 'కరోనా' వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రుల కీలక నిర్ణయాలు

telangana cabinet sub committee meet on corona

  • దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు
  • హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు
  • కరోనా చికిత్సకు ప్రత్యేక ఆసుపత్రి 
  • అన్ని శాఖల పరంగా చర్యలు

కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హెచ్చరించారు. ఈ రోజు కరోనాపై హైదరాబాద్‌లో మంత్రులు జరిపిన భేటీ ముగిసింది. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... కరోనా వస్తే తప్పక చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

కోవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కరోనాను అరికట్టేందుకు గాంధీ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వైరస్‌పై పత్రికలు, టీవీలు ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  చెప్పారు.

కరోనాకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల చెప్పారు. అన్ని శాఖల పరంగా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News