Jagan: జాతీయ జనాభా పట్టికపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

AP CM Jagan comments on NPR
  • ఎన్ పీఆర్ రాష్ట్ర మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తోందన్న జగన్
  • పార్టీలో దీనిపై చర్చించామని వెల్లడి
  • అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామంటూ ట్వీట్
కేంద్రం తీసుకువచ్చిన ఎన్ పీఆర్ (జాతీయ జనాభా పట్టిక) పై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. "ఎన్ పీఆర్ లో పొందుపరిచిన కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. మా పార్టీలో దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. 2010 నాటి పరిస్థితులకు తిరిగి మార్చాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తున్నాం. దీనిపై మేం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాం" అంటూ వెల్లడించారు.
Jagan
NPR
Andhra Pradesh
Minorities
AP Assembly Session
Central Government

More Telugu News