KCR: భద్రత విషయంపై రేవంత్‌రెడ్డి వినతికి స్పందించిన హైకోర్టు.. కేంద్ర హోంశాఖకు ఆదేశం
- కేసీఆర్‌తోపాటు ఓ పారిశ్రామికవేత్త నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యాజ్యం
- విచారించి కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన కోర్టు
- ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్త నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో కేంద్రం లేదా, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు రేవంత్‌రెడ్డి భద్రతపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. మరోవైపు, ఓటుకు నోటు కేసులో నిన్న ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట రేవంత్ హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17కు కోర్టు వాయిదా వేసింది.