Corona Virus: కరోనా ఎఫెక్ట్: మహేంద్రహిల్స్ పాఠశాలలకు సెలవులు
- గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఈ ప్రాంతం వాసి
- అధికారుల ముందు జాగ్రత్త చర్యలు
- ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మహేంద్రాహిల్స్ పరిసరాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. గత నెల 19వ తేదీన దుబాయి నుంచి బెంగళూరుకు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వచ్చాడు. అతను ఇక్కడి మహేంద్రాహిల్స్ ప్రాంతానికి చెందిన వాడు. గత నెల 22న ఇతను సొంతింటికి చేరుకున్నాక ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. ఆ తర్వాత అతనికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇతనికి నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.
అయితే దాదాపు ఐదు రోజులపాటు ఈ యువకుడు ఈ పరిసరాల్లోని పలుప్రాంతాల్లోనే తిరిగాడు. దీంతో అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు? అన్నదానిపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ప్రస్తుతం బాధితుడి ఇంట్లో కూడా ఎవరూ లేరు. వారంతా వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినట్టు మీడియా సమాచారం. మరోవైపు కంటోన్మెంట్ పారిశుద్ధ్య సిబ్బంది ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.