Coronavirus: 'కరోనా' విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం

Modi this year I have decided not to participate in any Holi Milan programme

  • కోవిడ్‌ -19 వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దు
  • ప్రపంచ వ్యాప్త నిపుణులు ఈ విషయాన్ని సూచిస్తున్నారు
  • దీంతో ఈ ఏడాది  హోలీ వేడుకలకు దూరంగా ఉంటాను

చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. 'కరోనా వైరస్ అయిన కోవిడ్‌ -19 వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని ప్రపంచ వ్యాప్త నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఈ ఏడాది  హోలీ వేడుకలకు దూరంగా ఉంటాను' అని ప్రకటించారు.

కాగా, కరోనా నియంత్రణ కోసం కరచాలనం, కౌగిలింతలు వంటివి మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జనాలతో క్లోజ్‌గా తిరగవద్దని చెబుతున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు జనసంచారం అధికంగా ఉండే చోట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News