KRT: కరోనా ఎఫెక్ట్.. కేటీఆర్ ఆదేశాలతో మెట్రో రైలు బోగీలను శుభ్రం చేసిన సిబ్బంది!
- హైదరాబాదులో పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు
- మెట్రో బోగీలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన కేటీఆర్
- కేటీఆర్ సూచనతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రైలు బోగీలు కిటకిటలాడుతుంటాయి. మరోవైపు నగరంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల ఆరోగ్యరీత్యా మెట్రోరైలు బోగీలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సూచించారు. కేటీఆర్ సూచనతో మెట్రో అధికారులు వెంటనే కదిలారు. మెట్రో సిబ్బంది బోగీలను కడిగి శుభ్రం చేశారు. బోగీలలోని సీట్లు, హ్యాండిల్స్, ద్వారాలను శుభ్రం చేశారు. ప్రయాణికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... మెట్రో పరిసరాలు, రైళ్లు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.