Kanna Lakshminarayana: హిందూ మత సంస్థలపై ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది: కన్నా ఫైర్
- ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరించాలి
- కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది
- ధర్మాన్నే భక్షించాలని చూస్తే మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అన్ని మతాలను సమానంగా ఆదరించాల్సిన ప్రభుత్వం, హిందూ మత సంస్థలు, ఆస్తులు, కార్యక్రమాలపై ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రణాళికాబద్ధంగా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, అటువంటి ధర్మాన్నే భక్షించాలని చూస్తే బీజేపీ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమేనని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.