Kadapa District: కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ స్థాపనకు స్విస్ కంపెనీ ఉత్సాహం
- సీఎం జగన్ ను కలిసిన ఐఎంఆర్ ఏజీ సంస్థ ప్రతినిధులు
- క్యాంపు కార్యాలయంలో చర్చలు
- 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్ నిర్మిస్తామన్న ఐఎంఆర్ ఏజీ
- ఇలాంటి సంస్థలతో చక్కని పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్న సీఎం
ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. తాజాగా, కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ స్థాపించేందుకు ఓ స్విస్ కంపెనీ ముందుకొచ్చింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఐఎంఆర్ ఏజీ ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏడాదికి ఒక కోటి టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సంస్థ వర్గాలు ప్రతిపాదించాయి. ఇలాంటి భారీ పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి మరింత అనుకూలత ఏర్పడుతుందని సీఎం జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.