Telugudesam: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంను ఆశ్రయించిన టీడీపీ

TDP seecks justice over bc reseravtions issue as approached SC
  • సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నేతలు
  • జగన్ కావాలనే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ వేయించారని ఆరోపణ
  • సుప్రీంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్న టీడీపీ నేతలు
మరికొన్ని రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై టీడీపీ గట్టి పట్టుదల ప్రదర్శిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీలు, నేతలు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, పల్లా శ్రీనివాసరావు, నిమ్మల కిష్టప్ప తదితరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం బీసీ రిజర్వేషన్ అంశంలో తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని అన్నారు. సీఎం జగన్ బీసీలకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్ వేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి సహకరించింది బీసీలేనని, ఇప్పుడు వాళ్ల రిజర్వేషన్లనే కుదించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.
Telugudesam
BC Reservations
Supreme Court
AP High Court
Local Body Elections

More Telugu News