Andhra Pradesh: ఏపీలో ఫైబర్ నెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం

AP government hikes fibre net charges
  • రాష్ట్రంలో 8.3 లక్షలకు పైగా ఫైబర్ నెట్ కనెక్షన్లు
  • నెలకు రూ.13 కోట్ల భారం మోస్తున్న ప్రభుత్వం
  • తాజాగా ఒక్కో కనెక్షన్ పై రూ.55 మేర పెంపు
  • ప్రభుత్వానికి రూ.3 కోట్ల మేర తగ్గనున్న భారం
రాష్ట్రంలో ఫైబర్ నెట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కనెక్షన్ పై రూ.55 మేర పెంచారు. చార్జీల పెంపు అనంతరం పన్నులు మినహా ఫైబర్ నెట్ నెలవారీ చార్జీ రూ.204కి చేరింది. ఒక్కో ఫైబర్ నెట్ కనెక్షన్ కు రూ.230 మేర ప్రభుత్వంపై భారం పడుతోంది. ఏపీలో ప్రస్తుతం 8.3 లక్షల పైచిలుకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై నెలకు రూ.13 కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తోంది. తాజాగా రూ.55 పెంచడంతో రూ.3 కోట్ల మేర భారం తగ్గనుంది. నష్టాల భయంతో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.
Andhra Pradesh
Fibre Net
Charge
Hike

More Telugu News