Tata Sons: రూ. 200 కోట్లు కొట్టేసేందుకు ప్లాన్... బెడిసికొట్టిన వైనం!

Plan to hack Tata Sons Account Busted

  • ఇండస్ ఇండ్ బ్యాంకులో టాటా సన్స్ ఖాతా
  • ఉద్యోగి నుంచి వివరాలు తెలుసుకున్న గ్రూప్
  • హ్యాక్ చేయడానికి ముందే పట్టేసిన పోలీసులు

టాటా కంపెనీల మాతృ సంస్థ టాటా సన్స్ కు చెందిన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా రూ. 200 కోట్లు కొట్టేయాలని భావించిన ఏడుగురు సభ్యుల ముఠా ఆటను పోలీసులు కట్టించారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసేలోపే అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, టాటా సన్స్ ఖాతా గురించిన వివరాలను ఇండస్ ఇండ్ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి నుంచి తెలుసుకున్న నిందితులు, దాన్ని హ్యాక్ చేయాలని ప్రయత్నించారు. అయితే, ఈలోగానే నిందితులు నసీమ్‌ సిద్దిఖి (35), గునజివ్‌ బారాయియా (56), సరోజ్‌ ఛౌధరి (25), సతీశ్‌ గుప్తా (32), అనంత్‌ ఘోష్‌ (34), ఆనంద్‌ నలవాడె (38)లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే, తమ వద్ద ఉన్న టాటా సన్స్ బ్యాంకు ఖాతాపై ఎటువంటి సైబర్ దాడులూ జరుగలేదని, ఈ విషయమై తమ భద్రతా విభాగానికి కూడా సమాచారం లేదని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

  • Loading...

More Telugu News