Nirmala Sitharaman: ఎస్‌ బ్యాంకు డిపాజిటర్ల డబ్బు సేఫ్: నిర్మలా సీతారామన్

Your Money Is Safe Nirmala Sitharaman Assures Yes Bank Depositors

  • ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగదన్న నిర్మల
  • ఆర్‌బీఐ గవర్నర్‌ తనకు ఈ విషయం చెప్పారని వ్యాఖ్య
  • నెల రోజుల్లో ఎస్‌ బ్యాంకు పునరుద్ధరణ: శక్తికాంతదాస్ 
  • రిజర్వు బ్యాంకు నిర్ణయం సరైందే:  ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ 

ఎస్‌ బ్యాంకు పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ స్పందించారు. డిపాజిటర్ల డబ్బు సేఫ్‌ అని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగదని ఆర్‌బీఐ గవర్నర్‌ నాకు స్పష్టం చేశారు' అని చెప్పారు.  

నెల రోజుల్లో ఎస్‌ బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌  శక్తికాంత దాస్‌ తెలిపారు.  ఎస్‌ బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి డబ్బు భద్రంగా ఉంటుందని, డిపాజిటర్ల భద్రత కోసం ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఎస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించి సరైన నిర్ణయం తీసుకుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ తెలిపారు. ఎస్‌ బ్యాంకు సంక్షోభాన్ని పరిష‍్కరించడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కృషిచేస్తోందని చెప్పారు. ఆ బ్యాంకుకు విలువైన ఆస్తులున్నాయన్నారు. పరిష్కారం కోసం ఆర్‌బీఐ అన్వేషిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News