Jagan: ఏపీలో ‘కరోనా’ నిరోధంపై సమీక్ష.. రూ.200 కోట్లు సిద్ధం చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు

AP CM Jagan Review on anti coronary measures

  • ‘కరోనా’ నిరోధానికి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి
  • విజయవాడ, అనంతపురంలో ప్రత్యేక వార్డులకు రూ.60 కోట్లు  
  • ‘కరోనా’ నిరోధంలో గ్రామ సచివాలయాలను భాగస్వామ్యం చేయాలి

కరోనా వైరస్ నిరోధంపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి  హాజరయ్యారు. ‘కరోనా’ను నిరోధించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు సిద్ధం చేయాలని, విజయవాడ, అనంతపురంలో ప్రత్యేక వార్డులకు రూ.60 కోట్లు కేటాయించాలని ఆదేశించారు.

‘కరోనా’ నిరోధంలో గ్రామ సచివాలయాలను భాగస్వాములను చేయాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని ఆదేశించారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్ వచ్చాయని, నాలుగు కేసులకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని జగన్ కు అధికారులు తెలిపారు. విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వారిలో నిన్నటి వరకు 6927 మందికి, నౌకల ద్వారా వచ్చిన 790 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News