Malladi Vishnu: చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుంది: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది

YSRCP MLA Malladi Vishnu comments on chandrababu
  • ‘స్థానిక’ ఎన్నికలు సమీపించే సరికి బాబుకు బీసీలు గుర్తొచ్చారా?
  • ఈ ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కనిపించదు
  • చంద్రబాబు ఐదేళ్ల పాలనపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా?
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంటే, ‘స్టే’ల కోసం టీడీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు.

‘స్థానిక’ ఎన్నికలు సమీపించే సరికి చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని, టీడీపీ హయాంలో ఆ వర్గాలకు బాబు చేసిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన బాధలో ఉన్న చంద్రబాబు, లోకేశ్ లు వైసీపీ ప్రభుత్వంపై కడుపుమంటతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుచూపు మేరలో టీడీపీ కనిపించదని జోస్యం చెప్పారు.
Malladi Vishnu
YSRCP
Chandrababu
Telugudesam
Local body Elections

More Telugu News