Nagababu: హిందువులు ఈ విషయంలో కొంచం తగ్గితే మంచిది!: సినీనటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- హిందువులకి మత సామరస్యం మరీ ఎక్కువ
- మతాన్ని, సంస్కృతిని కాపాడాలి
- మన సాములోర్లే జనాన్ని మోసం చేస్తే ఏమి చెయ్యగలం?
- నాస్తిక, ఆస్తిక హిందువులందరూ కలిసి మతాన్ని కాపాడుకుందాం
మన సంస్కృతిని కాపాడుకోవాలంటూ సినీనటుడు, జనసేన నేత నాగబాబు ప్రజలకు సూచించారు. 'హిందువులకి మత సామరస్యం మరీ ఎక్కువ. కొంచం తగ్గితే మంచిది. మతాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన మన సాములోర్లే జనాన్ని మోసం చేస్తే ఏమి చెయ్యగలం? నో నో మన మతాన్ని నాస్తిక ,ఆస్తిక హిందువులందరు కలిసి కాపాడుకుందాం' అని పిలుపునిచ్చారు.
'ఈ విషయంలో దేవుడిని నమ్మే హిందువులు ఏమి చేస్తారో స్పష్టమైన ఒక వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. చ చ ప్రభుత్వం వారే ఒక మతాన్ని ఇలా తొక్కేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనా? ఆదాయానికి హిందు దేవాలయాలు. ఓట్ల కోసం ఇతర మతాలకి వత్తాసు పలకడం సరైందా? హిందూమతం అంతరించిపోవటానికి దగ్గరగా ఉందేమో' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు నెటిజన్లు ఆసక్తికరంగా రిప్లై ఇస్తున్నారు. 'నాస్తిక హిందువు అనేది కొత్త మతమా మహానుభావా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.