Ben Stokes: బెన్ స్టోక్స్, మిచెల్ జాన్సన్ మధ్య చిచ్చురేపిన కరోనా

Ben Stokes and Mitchell Johnson in war of words over handshake policy

  • శ్రీలంక పర్యటనలో కరచాలనం చేయకుండా ఫస్ట్ బంప్ ఇవ్వాలని ఇంగ్లండ్ టీమ్ నిర్ణయం
  • దీనిపై వ్యంగ్యంగా స్పందించిన ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్
  • బెన్ స్టోక్స్ గట్టిగా పంచ్ ఇస్తాడు జాగ్రత్త పడాలని వెటకారం

కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో ఆ దేశ క్రికెటర్లతో కరచాలనం చేయకూడదని ఇంగ్లండ్ జట్టు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. లంక ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కాకుండా ‘ఫస్ట్ బంప్’ ఇస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రకటించాడు. ఫస్ట్ బంప్ అంటే పిడికిలి బిగించి ఒకరి చేతిని మరొకరు టచ్ చేయడం. అయితే, ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ వ్యంగ్యంగా స్పందించాడు. ఫస్ట్ బంప్ విషయంలో ఎవరితో ఎలా వున్నా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తో జాగ్రత్తగా ఉండాలని లంక క్రికెటర్లకు సూచించాడు. అతను చాలా గట్టిగా పంచ్ ఇస్తాడని వెటకారం చేశాడు.

ఈ క్రమంలో 2017లో ఓ పబ్ లో జరిగిన గొడవలో స్టోక్స్ ఇద్దరిని కొట్టి అరెస్టైన విషయాన్ని గుర్తు చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. దీనిపై బెన్ స్టోక్స్ కూడా దీటుగానే స్పందించాడు. 2010-11లో ఇంగ్లండ్ లో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా మిచెల్ జాన్సన్ ను ఎగతాళి చేస్తూ ‘బర్మీ ఆర్మీ’ (ఇంగ్లండ్ టీమ్ అభిమానుల గ్రూప్ పేరు) పాడిన పాట లిరిక్స్ ను ట్వీట్ చేశాడు. మరి, ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News