Holy: హోలీ సందర్భంగా హైదరాబాదులో మద్యం దుకాణాల మూసివేత.. ఆంక్షలు!

Two day liquor ban in Hyderabad

  • జంట నగరాల్లో కఠిన ఆంక్షలు
  • 9వ తేదీ నుంచి 11వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాల మూసివేత
  • పాదచారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీపీ

ఈ నెల 9న దేశవ్యాప్తంగా హోలీ పర్వదినం నిర్వహించుకోనున్నారు. హైదరాబాదులోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఎప్పట్లాగానే ప్రభుత్వం హోలీ సందర్భంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. మద్యం, కల్లు, బార్ అండ్ రెస్టారెంట్ లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా, రోడ్లపై హోలీ ఆడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాదచారులపై రంగులు చల్లడం, పబ్లిక్ ప్లేసుల్లో హోలీ ఆడడం, బైకులపై తిరుగుతూ కోలాహలం సృష్టించడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News