Telangana: తెలంగాణ బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు
- వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టామన్న మంత్రి హరీశ్ రావు
- ద్రవ్య లోటు 33,191.25 కోట్లుగా ఉన్నట్టు వెల్లడి
- కేసీఆర్ దార్శనికతతో బడ్జెట్ రూపొందించామని వ్యాఖ్య
2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ. 1,82,914.42 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1, 38, 669.82 కోట్లు, మూలధన వ్యయం రూ. 22,061.18 కోట్లుగా చూపారు. రూ. 4,482.12 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని, మొత్తంగా ద్రవ్య లోటును రూ. 33,191.25 కోట్లుగా అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.