nitin: 'షాలినితో హీరో నితిన్ పెళ్లి వాయిదా?' అంటూ వార్తలు.. కాదంటోన్న పెద్దలు
- అనుకున్న ముహూర్తానికే పెళ్లి
- దుబాయ్‌లో కుదరకపోతే హైదరాబాద్‌లో వివాహం
- హైదరాబాద్‌లో ఓ ఫామ్‌హౌస్ సిద్ధం
- ఇప్పటికే పెళ్లి దుస్తులు కొన్న వధూవరులు
'షాలినితో హీరో నితిన్ పెళ్లి వాయిదా?' అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో నిజం లేదని ఇరు వర్గాల పెద్దలు చెబుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పంక్షన్లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ నితిన్ పెళ్లిపై కూడా పడిందని ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన సంపత్‌కుమార్, నూర్జహాన్ దంపతుల రెండవ కుమార్తె షాలినితో ఇటీవల నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది.
దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 16న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. వాయిదా వేయకుండా వివాహాన్ని నిర్ణయించిన ముహూర్తానికే జరపాలని పెద్దలు నిర్ణయించారు.
ఇప్పటికే కంచి, చెన్నైలో పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు. కరోనా వైరస్ అదుపులోకి వస్తే దుబాయ్‌లో పెళ్లి జరుపుతామని, లేకుంటే హైదరాబాద్‌లోనే అనుకున్న ముహూర్తానికి వివాహం జరుపుతామని పెద్దలు అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వివాహం దుబాయ్‌లోనా? హైదరాబాద్‌లోనా? అన్న విషయంపై మాత్రమే స్పష్టత రాలేదు. అయితే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించనున్నారు.