Corona Virus: చైనాలో కరోనాతో మరో 27 మంది మృతి... ఇటలీలో 1.6 కోట్ల మంది బయటకు రాకుండా కఠిన చర్యలు

coronavirus spread in china italy

  • 3,097కు చేరిన చైనా 'కరోనా' మృతులు
  • ఇటలీలో పాఠశాలలు బంద్‌  
  • కొన్ని ప్రావిన్స్‌ ల్లో ప్రజలు బయటకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి

చైనాలో కరోనా వైరస్‌ సోకి మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో చైనాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,097కు చేరింది. చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ఇటలీలో పాఠశాలకు సెలవు ప్రకటించారు.

ఉత్తర ఇటలీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాదాపు 1.6 కోట్ల మంది ప్రజలను క్వారెంటైన్‌లో ఉంచింది. లాంబార్డీతో పాటు మరో 14 మధ్య, ఉత్తర ప్రావిన్స్‌ ప్రజలు బయటకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది.

పాఠశాలలతో పాటు జిమ్‌లు, స్కై రిసార్టులు, పబ్లిక్‌, ప్రైవేటు స్థలాల్లో పంక్షన్లు వంటి వాటిపై నిషేధం విధించింది. ఏప్రిల్‌ 3 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 230కి చేరింది.

  • Loading...

More Telugu News