Varla Ramaiah: వైసీపీకి మరోమారు అవకాశం కల్పిస్తే మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే: వర్ల రామయ్య
- ఏపీలో స్థానిక ఎన్నికలపై ప్రశ్నలు గుప్పించిన వర్ల రామయ్య
- వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ పాంప్లేట్ విడుదల
- మా ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని టీడీపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆ పార్టీ నేత వర్ల రామయ్య మరోమారు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాంప్లేట్ ను విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి మరోమారు అవకాశం కల్పిస్తే ‘మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే’ అని, స్థానిక ఎన్నికలపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.