TTD: ప్లీజ్.. ఆ లక్షణాలు ఉంటే రావొద్దు.. భక్తులకు టీటీడీ వినతి

Tirumala Devotees Advised Not To Come With Flu and Cough

  • జలుబు, దగ్గుతో బాధపడేవారు రావొద్దు
  • మాస్కులు, శానిటైజర్లు వెంట తీసుకురండి
  • ఆ లక్షణాలు కనిపించే భక్తులను స్విమ్స్‌కు తరలించాలని నిర్ణయం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి వారు దర్శనానికి వస్తే భక్తుల రద్దీ కారణంగా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్‌)కు తరలించాలని నిర్ణయించింది. అలాగే, భక్తులు శానిటైజర్లు, మాస్కులతో రావాలని సూచించింది.

  • Loading...

More Telugu News