Crude Oil: 20 సంవత్సరాల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర... బ్యారల్ రూ. 2,686!

Crude Oil Price Down Over Corona Virus

  • 1988 నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తు చేస్తున్న కరోనా
  • క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 473 తగ్గిన ధర
  • ఒక్క రోజులో 15 శాతం పతనం

ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు 20 సంవత్సరాల కనిష్ఠానికి పతనం అయ్యాయి. 1998లో ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన వేళ, క్రూడాయిల్ ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. నేడు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్, అదే విధమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

నేడు క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 473 తగ్గి, బ్యారల్ కు రూ. 2,686కు పతనమైంది. అంటే, ఒక్కరోజులోనే దాదాపు 15 శాతం మేరకు ధర తగ్గింది. ఇదే సమయంలో సహజవాయువు ధర 6.96 శాతం పడిపోయి రూ. 120కి దిగి వచ్చింది. ఇదే సమయంలో బంగారం ధర పది గ్రాములకు రూ. 3 తగ్గి 44,155 వద్ద, కిలో వెండి ధర రూ. 1,079 తగ్గి రూ. 45,890 వద్దా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News