Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి నటించడంపై కరీనా కపూర్ స్పందన 

Kareena Kapoor On Working With Irrfan Khan In Angrezi Medium
  • ఇర్ఫాన్ ఖాన్ ఒక బ్రిలియంట్ యాక్టర్
  • ఆయనతో నటించాలనే కోరికతోనే 'ఆంగ్రేజీ మీడియం' చిత్రానికి ఓకే చెప్పా
  • ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా
ఇర్ఫాన్ ఖాన్ ఒక బ్రిలియంట్ యాక్టర్ అని బాలీవుడ్ నటి కరీనా కపూర్ కితాబిచ్చింది. ఆయనతో కలిసి నటించాలనే కోరికతోనే 'ఆంగ్రేజీ మీడియం' చిత్రానికి ఓకే చెప్పానని తెలిపింది. ఈ చిత్రం పట్ల తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని... ఇర్ఫాన్ తో కలిసి నటించడమే దానికి కారణమని చెప్పింది. ఇర్ఫాన్ తో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని తెలిపింది. తన సోదరి కరిష్మా కపూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ 'మెంటల్ హుడ్'కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు స్పందించింది.

క్యాన్సర్ సోకిందని నిర్ధారణ అయిన తర్వాత ఇర్ఫాన్ నటిస్తున్న చిత్రం 'ఆంగ్రేజీ మీడియం'. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పంపిన మెసేజ్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు తాను హాజరుకాలేక పోతున్నానని ఆయన అన్నారు.
Irrfan Khan
Kareena Kapoor
Angrezi Medium Movie
Bollywood

More Telugu News