Amrutha: అంత్యక్రియలకు రావొద్దని చెప్పలేదు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు: అమృత వ్యాఖ్యలపై శ్రవణ్ స్పందన

Shravan comments on Amrutha
  • ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు
  • చివరి చూపు చూసుకునేందుకు అంగీకరించడం లేదన్న అమృత
  • ప్రారంభమైన మారుతీరావు అంతిమయాత్ర
తన తండ్రిని చివరి చూపు చూసుకునేందుకు తన తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించడం లేదని మారుతీరావు కుమార్తె అమృత ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తన తండ్రిని చూసేందుకు పోలీసుల భద్రతను కూడా కోరింది.

ఈ నేపథ్యంలో అమృత వ్యాఖ్యలపై శ్రవణ్ స్పందిస్తూ, అంత్యక్రియలకు రావొద్దని అమృతకు తాము చెప్పిలేదని... తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు, మిర్యాలగూడలోని మారుతీరావు ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Amrutha
Maruti Rao
Miryalaguda

More Telugu News