Corona Virus: కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్ల జాబితా విడుదల.. ఏపీ, తెలంగాణల్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే!

Complete list of 52 corona virus testing sites in India
  • 52 కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్ల జాబితా విడుదల
  • ఏపీలో తిరుపతి, విశాఖ, అనంతపురంలో టెస్టింగ్ సెంటర్లు
  • తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజీలో సెంటర్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 43కు చేరుకున్నాయి. వీటిలో 40 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేరళలో ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. కట్టుదిట్టమైన చర్యలతో కరోనా విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

మరోవైపు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 52 కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్ల జాబితాను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. వీటిలో మూడు సెంటర్లు ఏపీలో, తెలంగాణలో ఒకటి ఉన్నాయి. ఆ వివరాలు ఇవే.

ఆంధ్రప్రదేశ్: శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి.
                      ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్టణం.
                      గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం.

తెలంగాణ: గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్.
Corona Virus
Testing sites
India
Andhra Pradesh
Telangana

More Telugu News