Amrutha: అత్తింటి వారిని వదిలి తల్లి దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా లేను: అమృత

Amrutha says that she does not leave in laws
  • ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు
  • కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న అమృత
  • తండ్రిని బాబాయ్ శ్రవణ్ కొట్టినట్టు తెలిసిందని వెల్లడి
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. శ్మశానవాటికలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, మారుతీరావు కుమార్తె అమృత మీడియాతో మాట్లాడారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వెల్లడించారు. తన తండ్రి మారుతీరావును బాబాయ్ శ్రవణ్ కొట్టినట్టు తెలిసిందని తెలిపారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తాను చెప్పలేనని పేర్కొన్నారు.

భర్త చనిపోతే భార్య పడే బాధ తనకు తెలుసని చెప్పారు. ఇప్పటికిప్పుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఉండలేనని, ఆమె వచ్చి తనతో ఉంటానంటే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అత్తింటివారిని వదిలి తల్లి దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా లేనని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు శ్మశానవాటికకు వెళ్లానని, అయితే అక్కడ బాబాయ్ శ్రవణ్ కుమార్తె తనను నెట్టేసిందని వాపోయారు.

 ప్రణయ్ చనిపోయినప్పుడే తాను ఎంతో బలంగా నిలబడ్డానని, ఇప్పుడెందుకు నిలబడలేనని ధీమా వ్యక్తం చేశారు. బాబాయ్ శ్రవణ్ నుంచి అమ్మకు ప్రాణహాని ఉందని అమృత ఆరోపించారు. నాడు తన బాబాయ్ రెచ్చగొట్టడం వల్లే తండ్రి తప్పుచేశాడని భావిస్తున్నానని అన్నారు.
Amrutha
Maruti Rao
Sravan
Miryalaguda
Pranay

More Telugu News