Amaravati: అమరావతి గ్రామాల్లో జోన్ల మార్పు... నోటిఫికేషన్ విడుదల
- రాజధానిలో వివిధ అవసరాల కోసం భూ కేటాయింపులు
- ఇళ్ల స్థలాల కోసం జోన్ లు మార్చుతూ నిర్ణయం
- తుళ్లూరు, మంగళగిరి మండలాల గ్రామాల జోన్ ల మార్పు
ఏపీ రాజధాని అమరావతిలో జోన్ లు మార్చారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలను రిజర్వ్ జోన్, రీజనల్ సెంటర్ జోన్, నాన్ పొల్యూటింగ్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్, నైబర్ హుడ్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, బిజినెస్ పార్క్ జోన్ గా విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
కృష్ణాయపాలెం గ్రామంలో రిజర్వ్ జోన్, రీజనల్ సెంటర్ జోన్, నిడమర్రులో నాన్ పొల్యూటింగ్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్, కురకల్లులో టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఐనవోలులో బిజినెస్ పార్క్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, మందడంలో బిజినెస్ పార్క్ జోన్, టౌన్ సెంటర్ జోన్, నైబర్ హుడ్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, వెంకటాయపాలెంలో రీజనల్ సెంటర్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి ఉండడంతో జోన్లను మార్చాల్సి వచ్చింది.