Corona Virus: దటీజ్ కరోనా ఎఫెక్ట్... 70 వేల మంది కరుడుగట్టిన నేరస్తులను విడుదల చేసిన ఇరాన్!

Iran Releases 70 thousand Jail Inmates

  • కరోనా బారిన పడిన టాప్-3 దేశాల్లో ఇరాన్
  • ఇప్పటికే 237 మంది మృతి
  • పలు నేరాల్లో శిక్షలను అనుభవిస్తున్న ఖైదీల విడుదల

కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఒకటైన ఇరాన్, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్ లో మృతుల సంఖ్య 237కు పెరిగి, వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటిన వేళ, జైళ్లలో ఉన్న నేరస్తులను విడుదల చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి, శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది.

ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇక విడుదల చేసిన వారిని వైరస్ ప్రభావం తగ్గిన తరువాత తిరిగి జైళ్లకు తరలిస్తారా? లేదా? అన్న సంగతిని మాత్రం ఆయన వెల్లడించ లేదు.

  • Loading...

More Telugu News