Maruti Rao: అమృత తండ్రి మారుతీరావుకు ఏకంగా రూ.200 కోట్ల ఆస్తులు.. వాటి వివరాలు ఇవిగో!
- కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం ప్రారంభించిన మారుతీరావు
- అనంతరం రైస్ మిల్లుల బిజినెస్
- ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం
- చార్జిషీటులో ఆస్తుల వివరాలు
ఆత్మహత్య చేసుకున్న మారుతీరావుకు ఏకంగా రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే అంశమే ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఆ ఆస్తులను మారుతీ రావు తన భార్య, తమ్ముడి పేరిట వీలునామా రాసినట్లు తెలుస్తోంది.
కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం ప్రారంభించిన మారుతీరావు అనంతరం రైస్ మిల్లుల బిజినెస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం మారుతీరావు ఆస్తుల వివరాలను చూస్తే, ఆయన శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో విల్లాలు కట్టి అమ్మారు.
అమృత ఆసుపత్రి పేరుతో వంద పడకల హాస్పిటల్ ఉంది. ఆయన భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి, అంతేగాక ఆయనకు హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్లు, నల్లగొండలోని మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి. మారుతీ రావు తల్లి పేరుతో కూడా రెండంతస్తుల భవనం ఉంది. ఇవేగాక మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి ఆయనకు ఉంది.