Nandigam Suresh: కుల వివాదంలో వైసీపీ ఎంపీ.. రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

Complaint on YSRCP MP Nandigam Suresh over his caste
  • బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ను చుట్టుముట్టిన వివాదం
  • సురేశ్ ఎస్సీ కాదని ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్
  • విచారణ జరిపించి, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని విన్నపం
కుల వివాదంలో మరో వైసీపీ నేత చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ను వివాదం చుట్టుముట్టింది. గత లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంకు చెందిన సురేశ్ కు బాపట్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ అధినేత జగన్ కల్పించారు.

అయితే, సురేశ్ ఎస్సీ కాదని, ఆయన క్రిస్టియన్ అని ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసే అర్హత సురేశ్ కు లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపించి, సురేశ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఫిర్యాదులో కోరింది.
Nandigam Suresh
YSRCP
Bapatla
MP
Christian
SC
Caste
Legal Rights Protection
President Of India
Lok Sabha
Speaker

More Telugu News