Jaggareddy: కేటీఆర్ ఫామ్ హౌస్ పై దాడి వ్యవహారం రేవంత్ వ్యక్తిగతం: జగ్గారెడ్డి

Jaggareddy says fight over KTR farm house Revanth Reddy personal
  • 111 జీవో ఎత్తివేయాలన్న జగ్గారెడ్డి
  • రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడి
  • కాంగ్రెస్ లో ఎవరికి వారే మొనగాళ్లని వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. కేటీఆర్ ఫాంహౌస్ పై పోరాటం రేవంత్ వ్యక్తిగతమని అన్నారు. రేవంత్ పై కేసు అయినా, తనపై పాస్ పోర్టు కేసు అయినా వ్యక్తిగతమేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణాలపై పార్టీలో రేవంత్ రెడ్డి చర్చించలేదని జగ్గారెడ్డి వెల్లడించారు.

అయితే రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో 111 జీవో ఎత్తివేయాలని కోరారు. సంగారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్, ఫెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్, గ్రీన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమలో తమకు ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా శత్రువుపై పోరాటానికి ఒక్కటవుతామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ లో ఎవరికి వారే మొనగాళ్లు అని, పీసీసీ కోసం ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై ఉన్నారని వ్యాఖ్యానించారు.
Jaggareddy
Revanth Reddy
KTR
Farm House
Congress
PCC
Telangana

More Telugu News