Karanam Balaram: టీడీపీకి మరో షాక్​.. వైసీపీలో చేరనున్న ‘ప్రకాశం’ నేత కరణం బలరాం?

It is rumored that Karan will join Balaram TDP
  • రేపో, ఎల్లుండో వైసీపీ కండువా కప్పుకోనున్న బలరాం
  • ఆయనతో పాటు తనయుడు కరణం వెంకటేశ్ కూడా
  • ఇప్పటికే మంత్రి బాలినేనితో చర్చలు జరిపిన బలరాం
ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగలనుంది. చీరాల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కరణం బలరాం పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. రేపో, ఎల్లుండో వైసీపీ కండువా కప్పుకోనున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బలరాంతో పాటు తనయుడు కరణం వెంకటేశ్ కూడా వైసీపీలోకి వెళతారని సమాచారం. ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కరణం చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈరోజు ఉదయం కూడా బాలినేనిని ఆయన సంప్రదించారని సమాచారం.

కాగా, వైసీపీలోకి కరణంను ఆహ్వానిస్తూ గతంలో చాలాసార్లు ఆహ్వానం అందింది. జిల్లాలోని ప్రతి మండలంలో కరణం వర్గీయులు ఉన్నారు. బాలినేనికి, బలరాంకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
Karanam Balaram
Telugudesam
YSRCP
Balineni Srinivasa Reddy

More Telugu News