Harwey Weinsteen: హీరోయిన్లను లైంగికంగా వేధించిన హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు 23 ఏళ్ల జైలు శిక్ష

23 Years Jail Term for Harvey Weinstein

  • దాదాపు 90 మందిని వేధించిన హార్వీ
  • ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదేళ్ల శిక్షకు న్యాయవాదుల వినతి
  • తోసిపుచ్చిన న్యాయమూర్తి జేమ్స్ బుర్కే

ఎంతో మంది హీరోయిన్లు, ఇతర నటీ మణులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలను ఎదుర్కొంటూ, దోషిగా నిరూపితమైన హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు 23 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పిచ్చింది. హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరఫు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి జేమ్స్ బుర్కే తోసిపుచ్చారు. వాస్తవానికి ఆయనకు 29 సంవత్సరాల శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేసినా, సమాజానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కొంత శిక్షను తగ్గించామని న్యాయస్థానం పేర్కొంది.

కాగా, ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన హార్వీ, వీల్ చైర్ లోనే కోర్టుకు హాజరయ్యారు. తీర్పు అనంతరం మాట్లాడిన ఆయన, తనకంతా అయోమయంగా ఉందని, ప్రస్తుతం తాను దేశం కోసం బాధపడుతున్నానని అన్నారు. దాదాపు 90 మందిని ఆయన శారీరకంగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సినిమా అవకాశాలను ఎరజూపిన హార్వీ తమను మోసం చేశాడంటూ ఎంతో మంది ఫిర్యాదులు చేయడంతో, గత సంవత్సరం ఫిబ్రవరిలో 12 మంది సభ్యుల జ్యూరీ విచారణ చేపట్టి, అన్నీ వాస్తవాలేనని తేల్చింది. హార్వీ చేత వేదింపులు ఎదుర్కోబడిన వారిలో ఏంజెలినా జోలీ, సల్మా హయక్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం విస్తరించడానికి నాంది పలికిన సంఘటనగా హార్వీ కేసు పేరుతెచ్చుకుంది.  

  • Loading...

More Telugu News