america: అమెరికాలో కామారెడ్డి జిల్లా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

  • భిక్కనూర్‌ మండలానికి చెందిన బూర్ల అరుణ్‌ కుమార్‌(41)
  • ఉద్యోగ రీత్యా ఆయన 16 ఏళ్ల క్రితం అమెరికాకు
  • హ్యుస్టన్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం
  • అనారోగ్యంతో మృతి 
కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలానికి చెందిన బూర్ల అరుణ్‌ కుమార్‌(41) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అమెరికాలో మృతి చెందాడు. ఉద్యోగ రీత్యా ఆయన 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. హ్యుస్టన్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 16 ఏళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నాడు.

కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.  
america
Kamareddy District

More Telugu News