Corona Virus: స్పెయిన్ లో యువ మహిళా మంత్రికి కరోనా.. 2 వేలు దాటిన బాధితులు, 48 మంది మృతి
- హై అలర్ట్ ప్రకటించిన స్పెయిన్ ప్రభుత్వం
- మంత్రిని, ఆమె భర్తను క్వారంటైన్ చేసిన అధికారులు
- మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కరోనా టెస్టులు
- దేశ రాజధాని మాడ్రిడ్ లో స్కూళ్లు, కాలేజీలు మూత
యూరప్ ఖండంలోని దేశాలపై పంజా విసురుతున్న కరోనా వైరస్ స్పెయిన్ లోనూ కలకలం రేపుతోంది. ఆ దేశ సంక్షేమ శాఖ మంత్రి ఇరేన్ మొంటెరోకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు అధికారులు ప్రకటించారు. ఆమెను, ఆమె భర్త పాబ్లో ఇగ్లిసియాస్ ను క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. ఇరేన్ భర్త ఇగ్లిసియాస్ స్పెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రి కూడా. ఆయనకు వైరస్ ఉన్నట్టు ఇంకా తేలలేదు. అయినా పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరినీ కూడా క్వారంటైన్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.