New Delhi: రాష్ట్రపతి భవన్ సందర్శనకు నో... కరోనా ప్రభావం!
- ట్విట్టర్ లో ప్రకటించిన భవన్ వర్గాలు
- వైరస్ వ్యాప్తి అడ్డుకునే ముందస్తు చర్యలని స్పష్టీకరణ
- ఇంతకుముందే మొఘల్ గార్డెన్స్ మూసివేత
కరోనా వైరస్ విస్తరిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సందర్శనను అధికారులు నిలిపివేశారు. భవన్ సందర్శనకు ఎవరూ రావద్దని, చూసేందుకు అనుమతించమని భవన్ అధికారులు ట్విట్టర్లో ప్రకటించారు. ఇప్పటికే ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ సందర్శనను నిలిపివేసిన అధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
'కోవిడ్ 19 భయపెడుతోంది. వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని అధికారులు ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాష్ట్రపతి భవన్ మ్యూజియం సముదాయం (ఆర్బీఎంసీ), చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకలకు కూడా సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు.