Kuldipsengar: ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు పదేళ్ల జైలు శిక్ష

ten yeas iprisionment for kuldip sengar in another case
  • ఉన్నావో అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కుల్దీప్ 
  • తాజాగా బాధితురాలి తండ్రి లాకప్ డెత్ కేసులోనూ శిక్ష 
  • ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఉన్నావో అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయి జీవిత ఖైదు అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ కు మరో పదేళ్ల జైలు శిక్ష పడింది. నిందితురాలి తండ్రి లాకప్ డెత్ కేసులోనూ కుల్దీప్ పాత్రను నిర్ధారిస్తూ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఓ బాలికపై అత్యాచారం చేసినట్టు కుల్దీప్ సెంగార్ పై వచ్చిన ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లపాటు ఈ కేసు కోర్టులో నడవగా 2017లో ఈ కేసులో కుల్దీప్ ను దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో భారతీయ జనతా పార్టీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.

కాగా అత్యాచారం కేసు నడుస్తుండగానే బాధితురాలి తండ్రి లాకప్ లో చనిపోయాడు. ఈ మరణం వెనుక కుల్దీప్ తోపాటు మరో ఆరుగురి పాత్ర ఉందన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన తీస్ హజారీ కోర్టు కుల్దీప్ తోపాటు మరో ఆరుగురు దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

అలాగే బాధితురాలి కుటుంబానికి కుల్దీప్ రూ.10 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. అదే విధంగా కుల్దీప్ సోదరుడు అతుల్ సెంగార్ కూడా బాధిత కుటుంబానికి మరో రూ.10 లక్షలు పరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పింది.

Kuldipsengar
unaav rape case
iprisionment
Uttar Pradesh

More Telugu News