Oypmpics: ఒలింపిక్స్ వద్దు: ట్రంప్ సంచలన స్టేట్ మెంట్!
- ఏడాది పాటు వాయిదా వేయండి
- ప్రేక్షకులు లేకపోతే పోటీలు బోసిపోతాయి
- పోటీలు ఆగబోవంటున్న జపాన్
ఈ సంవత్సరం జపాన్ లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలను నిర్వహించ వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కనీసం ఏడాది పాటు పోటీలను వాయిదా వేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ కు మిగతా దేశాల నుంచి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదని, అప్పుడు పోటీలే బోసిపోతాయని అభిప్రాయపడ్డ ఆయన, అనేక క్రీడా టోర్నీలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ప్రేక్షకులు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరగడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు.
కాగా, కరోనా ప్రభావం ఎలా ఉన్నా, పోటీలు ఆగబోవని, వీటిని ఆపబోమని టోక్యో గవర్నర్ యురికో కొయ్కే గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోటీల్లో పాల్గొనాలని భావించే వారంతా ప్రాక్టీస్ ను కొనసాగించాలని ఇటీవలే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా సూచించింది.