IPL: ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం
- కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 200 మందికి మించి హాజరయ్యే అన్ని ఆటల నిర్వహణపై నిషేధం
- ఇప్పటికే మూతపడ్డ విద్యాలయాలు, సినిమా థియేటర్లు
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించింది. కరోనా విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 200 అంతకు మించి ప్రేక్షకులు హాజరయ్యే ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, మార్చ్ 31 వరకు విద్యాలయాలు, సినిమా థియేటర్లను మూసివేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.