Narendra Modi: మన భూమండలం ఇప్పుడు కోవిడ్-19తో పోరాడుతోంది: మోదీ
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ప్రభావం
- భారీస్థాయిలో మరణాలు
- ప్రజల ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదన్న ప్రధాని మోదీ
చైనాలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్ ఇతర ఆసియా దేశాల్లోనూ, యూరప్ దేశాల్లోనూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. అనేక దేశాల్లో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. భారత్ లో కూడా తొలి మరణం నమోదు కాగా, క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
"ఇప్పుడు మన భూమండలం కోవిడ్-19 నావెల్ కరోనా వైరస్ తో పోరాడుతోంది. వివిధ స్థాయుల్లో ప్రభుత్వాలు, ప్రజలు ఆ మహమ్మారితో శక్తిమేర యుద్ధం చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో అత్యధికులకు ఆవాసంగా ఉన్న దక్షిణాసియా, తమ ప్రజల ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదని చాటాల్సిన సమయం వచ్చింది" అంటూ ట్వీట్ చేశారు. కరోనాపై సమష్టిగా పటుత్వ పోరాటం చేయడం ద్వారా సార్క్ దేశాలు మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ పిలుపునిచ్చారు.