Buggana Rajendranath: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది... పెండింగ్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: బుగ్గన

AP finance minister Buggana met union minister Nirmala Sitharaman
  • ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలిసిన బుగ్గన
  • రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపణ
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, రూ.5 వేల కోట్ల గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరామని వివరించారు.

గత రెండేళ్లుగా గ్రామ, మున్సిపాలిటీలకు నిధులు రాలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెండింగ్ నిధులను కోరామని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల పథకాల గురించి కూడా కేంద్రానికి వివరించామని బుగ్గన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3 వేల కోట్లు కూడా అడిగామని వెల్లడించారు.
Buggana Rajendranath
Nirmala Sitharaman
Funds
Andhra Pradesh
Polavaram Project

More Telugu News