Indian Railways: ప్రజలు తమ ఫోన్ల ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే ఏజెంట్ల అవసరం ఉండదు: గోయల్
- రైల్వేశాఖపై లోక్ సభలో చర్చ
- టికెట్లు పెద్ద ఎత్తున బుక్ చేసేందుకు సాఫ్ట్ వేర్లు వాడుతున్నారని వెల్లడి
- ప్రైవేటు ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిషేధంపై పరిశీలన
ప్రస్తుతం అమల్లో ఉన్న టికెట్ బుకింగ్ విధానంపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. టికెట్లను అక్రమంగా పెద్ద ఎత్తున బుక్ చేసేందుకు కొందరు పలు రకాల సాఫ్ట్ వేర్లు ఉపయోగిస్తున్నారని, అలాంటి వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు తమ మొబైల్ ఫోన్లలోనే టికెట్లు బుక్ చేసుకుంటే ఏజెంట్ల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఫోన్ల ద్వారా బుక్ చేసుకోలేని వారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేవా కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. త్వరలోనే ప్రైవేటు విక్రయదారులు, ఏజెంట్లు రైల్వే టికెట్లు బుక్ చేయకుండా నిషేధం విధించడం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. లోక్ సభలో రైల్వేశాఖపై చర్చ సందర్భంగా గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు.