Nara Lokesh: ఓ ‘దిశ’ నువ్వెక్కడ?..మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా?: నారా లోకేశ్
- మా అభ్యర్థులపై దాడులకు దిగి నామినేషన్ పత్రాలు చించేస్తారా?
- దళిత మహిళపై దారుణంగా వ్యవహరిస్తారా?
- జగన్ గారూ, 21 రోజుల్లో న్యాయం ఎక్కడికి పోయింది?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేస్తున్న టీడీపీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఓ దిశ నువ్వెక్కడ? రాష్ట్రంలో మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా?‘ అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్టు చేశారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన తమ అభ్యర్థులపై భౌతిక దాడికి దిగి నామినేషన్ పత్రాలు చించేస్తారా? పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత మహిళపై వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ధ్వజమెత్తారు. ‘జగన్ గారూ, 21 రోజుల్లో న్యాయం ఎక్కడికి పోయింది?’ అని లోకేశ్ ప్రశ్నించారు.